- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిగారి ఇంట పెళ్లి భోజనాలు.. అతిథులెవరో తెలుసా?
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మంత్రిగారి ఇంట ఆదివారం పెళ్లి వంటకాలు ఘుమఘుమలాడాయి. ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులతో కలిసి మంత్రివర్యులు భోజనాలు చేశారు. ముహూర్తాలు లేని ఈ సమయంలో శుభ కార్యాలు ఏంటబ్బా అని అనుకుంటున్నారా?. వివరాళ్లోకి వెళితే.. ఇటీవల వనపర్తి జిల్లాలోని దాదాపు 421 మంది ఇళ్లల్లో వివాహాలు జరిగాయి. అయితే.. ఆ లబ్ధిదారులందరూ తమ బిడ్డల పెళ్లికి రావాలని మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర కారాణాల దృష్ట్యా మంత్రి ఏ శుభకార్యానికి హాజరుకాలేకపోయారు. దీంతో వారు కాస్త నిరాశకు గురయ్యారు. విషయం తెలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి కాస్త వినూత్నంగా వారిని శాంతింపజేశారు. ఈలోపు వారందరికీ కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరినీ ఇంటికి పిలిపించి, వారితో ఆయన పెళ్లి భోజనాలు చేసి, చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్టాడుతూ.. ‘మీ అందరి క్షేమం కోసమే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం చేపట్టారు. ఈ పథకమే, కాకుండా ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఏ చింతాలేకుండా అందరూ హాయిగా, నిశ్చింతగా ఉండండి. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజనాలు వడ్డించి సందడి చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీంతో మంత్రిగారిది మంచి మనసు’ అంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.