- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్: నిరంజన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయిల్ఫామ్ సాగుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, రైతులకు రాయితీ ఇస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్ ఉద్యానవనశాఖ శిక్షణా కేంద్రంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహంపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఆయిల్‌ఫాం సాగును ఉధృతం చేయాలని, ఎకరా సాగుకు తొలి నాలుగేండ్లకు రూ. 1,38,680 వరకు (సూక్ష్మ సేధ్యంతో కలిపుకుని) ఖర్చు అవుతందని, దీనిలో ప్రభుత్వం రూ. 31,832 వరకు రాయితీ ఇస్తుందన్నారు. దేశ జనాభాకి మిలియన్ టన్నుల వంట నూనెల అవసర ఉండగా కేవలం (7) మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు.
దేశంలో 8.25 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగవుతోందని, దీని ద్వారా ఏడాదికి 16.85 లక్షల మెట్రిక్ టన్నుల గెలలు, 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ముడి ఫామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రానికి 3.66లక్షల టన్నుల ఫామ్ ఆయిల్ అవసరముంటే 38వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందన్నారు. ఎకరానికి 10-12 టన్నుల గెలల చొప్పున 25 నుంచి 30 ఏండ్ల వరకు ప్రతిఏటా రూ. 1.20లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా ఉంటుందని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ఫామ్ను సాగు చేయవచ్చన్నారు.