అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్ ఇల్లు: నిరంజన్‌రెడ్డి

by Shyam |   ( Updated:2020-05-30 05:07:40.0  )
అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్ ఇల్లు: నిరంజన్‌రెడ్డి
X

దిశ, మహబూబ్‌నగర్: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌‌రూమ్ ఇల్లు అందిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది కేసీఆర్ ఆకాంక్ష అని, త్వరలోనే లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దగూడె, అప్పాయపల్లి, చిట్యాలలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. పెద్దగూడెం చౌరస్తాలో 296 ఇళ్లు చివరి దశలో ఉన్నాయని, అప్పాయపల్లిలో 160 ఇళ్లు వారంరోజుల్లో పూర్తవుతాయన్నారు. రోడ్ల విస్తరణలో నిరాశ్రయులైన వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పీర్లగుట్ట, రామాలయం ప్రాంతాల్లో మరో 2వేల గృహాలను సీఎం కేసీఆర్ ద్వారా మంజూరు చేయించుకొని నిర్మిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed