RK బీచ్‌కు ‘బ్లూ ఫాగ్ సర్టిఫికేట్’..

by srinivas |
RK బీచ్‌కు ‘బ్లూ ఫాగ్ సర్టిఫికేట్’..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని వైజాగ్‌ రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్ బీచ్’ గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ పరిశుభ్రత బీచ్‌లకు ఇచ్చే గుర్తింపులో భాగంగా రుషికొండ సముద్ర తీరాన్ని ఈ జాబితాలో చేర్చారు. దీని ద్వారా రాష్ట్ర పర్యాటకానికి మరింత మేలు జరుగుతుందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఈ గుర్తింపుతో బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని..అక్కడ 7 స్టార్ హోటల్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని పర్యాటక శాఖ సీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కాగా, ఆర్కే బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్’ రావడంపై పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. మరికొన్ని బీచ్‌లకు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందేలా కృషి చేస్తామన్నారు.దీనికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story