- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టణ పరిశుభ్రతే ముఖ్యం : మంత్రి మల్లారెడ్డి
దిశ,మేడ్చల్: పట్టణ పరిశుభ్రతే ముఖ్యమని, శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. జూన్ 1 నుంచి 8 వరకూ పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందన్నారు. ఈ నేపథ్యంలో బోడుప్పల్ రాచెరువు పరిసర ప్రాంతంలో చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించినట్టు తెలిపారు. పట్టణ ప్రగతి పారిశుధ్య కార్యక్రమ సమయంలోనే పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయనతో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటి మేయర్ లక్ష్మి, జెడ్పీటీసీ సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.