- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిజిటల్ మీడియాలో 'దిశ'దే అగ్రస్థానం :మల్లారెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్: దిశ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్న దిశ పత్రిక డిజిటల్ మీడియా రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. నిజాన్ని నిర్భయంగా రాస్తూ దిన దినాభివృద్ధి చెందాలని కోరారు. అనతి కాలంలో పాఠకుల ఆదరణ చూరగొన్న దిశ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు మల్లారెడ్డి తెలిపారు.
కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ఆధునిక జర్నలిజానికి దిశ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ప్రజా సమస్యలపై తన అక్షర గళాన్ని వినిపిస్తూనే.. నవతరానికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా దిశ పత్రిక ఇంఛార్జి కల్లేపల్లి రవి చంద్ర, కుత్బుల్లాపూర్ ఇంఛార్జి రెడ్డే బోయిన మల్లేష్ యాదవ్, కూకట్ పల్లి ఇంఛార్జి ఎం. ఏ. కరీం, టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జవహర్‌నగర్ కార్పొరేటర్ ఏకే. మురుగేష్, రాంపల్లి పెంటయ్య, ఏపీఐటీ డైరెక్టర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, టింకు గౌడ్, వినోద్ కుమార్.నరేష్ కుమార్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.