28న కామినేని ఫ్లైఓవర్ ప్రారంభం

by Shyam |
28న కామినేని ఫ్లైఓవర్ ప్రారంభం
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో మరో రెండు పనులు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్యాకేజీ-2లో మొదటి ఫేజ్‌లో భాగంగా ఎల్‌బీ‌నగర్‌ సర్కిల్‌లో రూ.14 కోట్లతో నిర్మించిన అండర్ పాస్, కామినేని జంక్షన్ నుంచి నాగోల్ వైపు రూ.43కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కామినేని వద్ద ఇప్పటికే ఎడమ వైపు ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. రెండో వైపు ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వస్తుండటంతో సికింద్రాబాద్ నుంచి ఓవైసీ ఆస్పత్రి రూట్‌లో ట్రాఫిక్ తగ్గుతుందని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఎల్‌బీ‌నగర్ రింగ్ రోడ్ నుంచి నాగోల్ రూట్‌లోనూ ట్రాఫిక్ తగ్గి వాహనాల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి కామినేని హాస్పిటల్ రూట్‌లో ఎల్‌బీ‌నగర్ చౌరస్తా మీదగా అండర్ పాస్ కూడా అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రారంభిస్తున్న ఫ్లైఓవర్‌కు కంటిన్యూ రూట్‌లోనే అండర్ పాస్ ఉండటంతో ఎల్‌బీ‌నగర్ సర్కిల్ తాకకుండానే సాగర్ రింగ్ రోడ్‌కు వెళ్లవచ్చు. ఫ్లైఓవర్, అండర్ పాస్ ఒకే రూట్‌లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సర్కిల్ వద్ద సిగ్నల్ వద్ద ఆగే పనిలేకుండా వాహనాలు వెళ్లిపోవచ్చు. సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

కామినేని ఫ్లైఓవర్ వివరాలు:

పొడవు: 940 మీటర్లు
ఖర్చు: రూ.43 కోట్లు
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు (2015): 10,324
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు మెట్రోతో (2015) : 6,504
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు అంచనా (2034) : 16,209

ఎల్‌బీనగర్ జంక్షన్ అండర్ పాస్:

పొడవు: 510 మీటర్లు
ఖర్చు: రూ.14 కోట్లు
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు (2015): 14,153
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు మెట్రోతో (2015) : 8,916
పీక్ అవర్‌లో పీఎస్‌యూలు అంచనా (2034) : 21,990

Advertisement

Next Story