- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని శుక్రవారం ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:30గంటలకు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఓపెనింగ్ జరుగనుంది. దాదాపు రూ.184 కోట్ల వ్యయంతో ప్రభుత్వం దుర్గం చెరువు వంతెనను నిర్మించింది. అంతేగాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కే కేశవరావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హాజరవుతారు. దీనితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా ప్రారంభిస్తారు.