మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ: కేటీఆర్

by Shyam |
మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ: కేటీఆర్
X

దిశ, న్యూస్​బ్యూరో: పట్టణప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది కేటాయించాలని సూచించారు. ప్రస్తుతమున్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత అవసరాల మేరకు కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు ఆయన వివరించారు. నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed