- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్ సిద్ధం చేయాలి
దిశ, నిజామాబాద్: నిజామాబాద్, కరీంనగర్ పట్టణాలకు సంబంధించిన వాటర్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ రెండు జిల్లాల్లోని కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధి పై హైద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పౌరుల కనీస అవసరాలను తీర్చడం పైన ప్రధాన దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్మశాన వాటికలు, పార్కులు, జంక్షన్లలో అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్‌ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. రెండు కార్పొరేషన్లు వాటర్, ఎనర్జీ ఆడిటింగ్‌ను రానున్న 15 రోజుల్లో పూర్తి చేసి, ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాలతో పాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, అవకాశం ఉన్న ప్రతి చోట ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. పట్టణాల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల పైన సమీక్ష నిర్వహించుకుని ఆదర్శవంతమైన పద్ధతులను అలవరుచుకోవాలని చెప్పారు. సమీక్ష తర్వాత స్థానిక కార్పొరేషన్ల వారీగా ఆయా జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష సమావేశాలను నిరంతరం కొనసాగించాలని మంత్రి కేటీఆర్ కోరారు.ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, రసమయి బాలకిషన్ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.