కీటక జనిత వ్యాధుల విశ్లేషణపై పుస్తకం..

by Shyam |
కీటక జనిత వ్యాధుల విశ్లేషణపై పుస్తకం..
X

దిశ, తెలంగాణ బ్యూరో :

డెంగ్యూ, మలేరియా ఇతర కీటక జనిత వ్యాధులను వివరిస్తూ అయ్యదేవర రోషన్ చంద్ర రాసిన పుస్తకాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందులో రాబోయే 2025 సంవత్సరానికి ఎన్ని డెంగ్యూ కేసులు, మలేరియా కేసులు నమోదయ్యే అవకాశం వుంది, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ముందుగానే సాఫ్ట్ వేర్, కోడ్ ద్వారా వివరించారు.

మూసీ నది, చెరువులలో ఉన్న గుర్రపుడెక్క వల్ల, ఇండ్లల్లో నీరు నిలువ ఉండటం వలన వచ్చే వ్యాధులను వివరించారు. ఈ పుస్తకం రాబోయే సంవత్సరాల ప్రణాళికను తయారుచేయడానికి ఉపయోగ పడుతుందని మంత్రి కేటీఆర్ రోషన్ చంద్రను అభినందించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ,విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed