భట్టి విక్రమార్క మంచోడే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-10-19 04:23:51.0  )
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో పాల్గొని కేటీఆర్ మాట్లాడుతూ.. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కది ఏం నడుస్తలేదని, గట్టి అక్రమార్కుడిదే నడుస్తోందని రేవంత్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, ఇప్పుడు సన్యాసిలా తిరుగుతున్నాడని సీరియస్ కామెంట్స్ చేశారు. నాకు తెలిసి భట్టి విక్రమార్క మంచోడేనని, ప్రస్తుతం ఆయనకు పార్టీలో గతంలో ఉన్న స్థానం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని, ఓ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టి, పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed