దేశానికి నూతన టెక్ హబ్ హైదరాబాద్ !

by Shyam |
దేశానికి నూతన టెక్ హబ్ హైదరాబాద్ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: తక్కువ కాలంలోనే అనేక అంతర్జాతీయ పెట్టుబడిదార్లను ఆకర్షించాం. రాష్ట్రంలో సుస్థిర, సంచలనాత్మక సాంకేతికతలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆరేళ్లలో దేశంలోనే హైదరాబాద్‌ను నూతన టెక్ హబ్‌గా మార్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డల్లాస్ సెంటర్‌లో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి తాజా ఫ్లాట్ షిప్ అధ్యయనం నివేదికను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని, మరెన్నో నిర్మాణంలో ఉన్నట్లు గుర్తుచేశారు. మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ ముమ్మరంగా అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తుందన్నారు.

హైదరాబాద్ బిజినెస్ హబ్

కొన్నేండ్లుగా దేశానికి.. హైదరాబాద్ ముఖ్యమైన బిజినెస్ హబ్‌గా అవతరించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ అన్నారు. ఆర్ధికాభివృద్ధి సాధించాలనుకునే వారికి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వివరాలను అందిస్తామన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ వంటి పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

నివేదికలోని ప్రధానాంశాలు

– హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ 2014 నుంచి 2019 మధ్య లావాదేవీలు 172శాతం పెరిగాయి.
– పదేళ్లలో నివాస గృహాల ధరలు 5.3శాతం సీఏజీఆర్ వంతున పెరిగాయి. కొవిడ్ సమయంలోనూ కిరాయిలు స్థిరంగా ఉన్నాయి.
– దేశ ముఖ్య నగరాల్లో వార్షిక కార్యాలయ స్థల డిమాండ్ పరంగా 2014లో ఆరో ర్యాంకు. 2019లో రెండో స్థానానికి చేరుకున్నది.
– దేశంలో ప్రయాణాల ట్రాఫిక్‌లో హైదరాబాద్ విమానాశ్రయం వాటా 2014-15లో 5.5శాతం, 2019-20 లో 6.4 శాతంగా నమోదైంది.

Advertisement

Next Story