- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షం అని అన్నారు. హైదరాబాద్‌లో 80 శాతం అత్యధిక వర్షం పడిందని తెలిపారు. హైదరాబాద్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యధిక వర్షాలు పడుతున్నాయని వెల్లడించారు. దీంతో ఎప్పటికప్పుడూ జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. అందుకే చాలా మందిని కాపాడగలిగామన్నారు. దాదాపు 80 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.
వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంత బీభత్సమైన వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేగాకుండా శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నామని తెలిపారు. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రస్తుతం 80 కాలనీలు వరదల్లో ఉన్నాయన్నారు.
వర్షాల వల్ల ఇప్పటివరకూ 33 మంది చనిపోయారని స్పష్టం చేశారు. అంతేగాకుండా వరదల్లో తప్పిపోయిన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సహాయక చర్యల కోసం రూ.45 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. వరద బాధితులకు 37 వేల కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. 54 అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లోకి నీళ్లు చేరాయని వెల్లడించారు. దాదాపు 1920 ట్రాన్స్‌ఫార్మలర్ల రిపేర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే 50 బోట్లు సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇప్పటికే ఆర్మీతో కూడా మాట్లాడామని, అవసరమైతే వారిని కూడా రంగంలోకి దించుతామని వెల్లడించారు.