వారు ప్రజల్లో తక్కువ….సోషల్ మీడియాల్లో ఎక్కువ ఉంటారు….

by Shyam |
వారు ప్రజల్లో తక్కువ….సోషల్ మీడియాల్లో ఎక్కువ ఉంటారు….
X

దిశ, వెబ్ డెస్క్:
దేశంలోనే అత్యధికంగా రుణమాఫీని తెలంగాణ రాష్ట్రం చేసినట్టు ఆర్బీఐ చెప్పిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు ద్వారా మరో రూ. 28వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని ఆయన తెలిపారు. అప్పులు పెరిగాయనీ చెప్పేవారు.. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని ఎందుకు చెప్పడం లేదని ఆయన అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దుబ్బాకలో డిపాజిట్లు రాకున్నా ఆశ్చర్య పోనక్కర లేదని అన్నారు. ఎన్నికల కోసమే డబ్బులు తెచ్చామని రఘునందన్ కుటుంబ సభ్యులే చెప్పారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రజల్లో తక్కువ..సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story