- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు తెలంగాణ తల్లి సోనియా.. రేపటిరోజున తండ్రి చంద్రబాబా..?
దిశ, తెలంగాణ బ్యూరో : సోనియాగాంధీని తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. నాడు 1200 మంది తెలంగాణ బిడ్డలను బలితీసుకున్న బలిదేవత కూడా సోనియాగాంధీయే అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశాడు. కొన్ని రోజులు ఆగితే చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదన్నారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి మాటలు చెప్తుండని, ఆయన పార్టీ మారడం గురించి మాట్లాడితే ప్రజలు కొడుతారన్నారు. కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ కు ప్రధానమంత్రి పదవి దొరికినట్లు బిల్డప్ కొడుతుండని విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీలో గెలిచిన రేవంత్ రెడ్డి రాజీనామా చేసి పార్టీ మారారా అని ప్రశ్నించారు. కొనుడు అమ్ముడు రేవంత్ కంటే ఎక్కువ ఎవరికీ తెలుసు అని, పైసల కట్టలతో దొరికింది నువ్వు… నీతులు మాట్లాడుతున్నావా? అని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ప్రకటనలు చేస్తున్నావ్.. పార్టీలు మారిన నిన్ను ఏం చేయాలి?.. రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారారన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం టీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. బజారు నాయకులు చిల్లర మల్లర మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉన్నతమైన పదవులు వస్తే ఉన్నతంగా పనిచేసుకుంటే మంచిదని సూచించారు.
టీపీసీసీ కాదు… టీడీసీసీ
రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి టీపీసీసీ తెచ్చుకున్నాడని సొంత పార్టీ నేతలే అంటున్నారు.. ఆయనకు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు. అది టీపీసీసీ కాదు… టీడీసీసీ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ లేకపోతే టీకాంగ్రెస్, టీబీజేపీ అని పదవులు వచ్చేవా..? అని ప్రశ్నించారు. ఎవరు మొరిగినా పట్టించుకోవద్దని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.