- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్పంచ్‌లతో ‘కొప్పుల’ టెలీకాన్ఫరెన్స్..అభివృద్ధి పనులపై ఆరా
దిశ, కరీంనగర్:
కరోనా కష్టకలాన్ని అధిగమిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నారు. మంగళవారం తన నియోజకవర్గంలోని సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 60 గ్రామాల సర్పంచ్2లతో కరీంనగర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నరేగా స్కీం నిధులతో చేపట్టిన పనులను కొంత మంది సర్పంచ్‌లు పూర్తి చేసారని, మిగతా వారు సమయం గడిచిపోయినా పూర్తి చేయలేదని తెలిపారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు కాగా, వాటిలో రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేశామన్నారు. మిగతా రూ.7 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. కరోనా కారణంగా నిధుల లేమి తీవ్రంగా ఉన్నప్పటికీ అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.నిధులను సద్వినియోగం చేసుకునేందుకు సర్పంచ్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, అన్ని గ్రామాలకు సంబంధించిన పనుల తాలుకు బిల్లులు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామిఇచ్చారు.అయితే సర్పంచ్‌లు కూడా ఎప్పటికప్పుడు వాటిని రికార్డు చేయించాలని కోరారు.