- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహాద్భుతమైన పథకం దళిత బంధు: కొప్పుల ఈశ్వర్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దళితులంతా ఆత్మగౌరవంతో తలెత్తుకునే మహాద్భుతమైన పథకం దళితబంధు అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సభ విజయవంతమైందన్నారు. దళిత జాతి సముద్ధరణకు మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. పథకంను ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు సాగుతుందని సీఎం చెప్పడంతో దళిత జాతి హర్షామోదాలు వ్యక్తం చేస్తుందని అన్నారు. సభకు అంచనాలకు మించి లక్షన్నర మందికి పైగా దళితులు తరలివచ్చారన్నారు. సభ విజయవంతానికి సహకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Next Story