‘అడ్డంకులు సృష్టించినా… పంచి తీరుతాం’

by srinivas |
Kodali Nani
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం కోసం ఎలాంటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గుడివాడలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చిల్లర రాజకీయం తనకు చిన్నప్పటి నుంచే తెలుసన్నారు.

టీడీపీలో పనిలేని వారు తనపై ఫిర్యాదు చేస్తే ఏమౌవుతుందని ప్రశ్నించారు. తనపై ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి అన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని కోర్టుల్లో కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. కాదని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Advertisement

Next Story