మోడీని సతీసమేతంగా గుడికి వెళ్లాలని చెప్పండి !

by Anukaran |   ( Updated:2020-09-23 04:37:52.0  )
Minister Kodali Nani
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, బీజేపీపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. డిక్లరేషన్ విషయంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తే.. బీజేపీ ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు. తిరుమల వెంకన్నను కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ తొలగించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పెద్ద పెద్ద మాటలంటున్న బీజేపీ నేతలు.. ముందు ప్రధాని మోడీని సతీసమేతంగా ఆలయాలకు వెళ్లాలని చెప్పండని సూచించారు. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ ఆలయాలకు వెళ్లినప్పుడు సతీసమేతంగా వెళ్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అన్ని మతాలకు చెందిన వ్యక్తి అని.. శ్రీవారి దయవల్లే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అందరినీ సమానంగా పరిపాలిస్తానని జగన్ ప్రమాణం చేశారని చెప్పారు.

Advertisement

Next Story