రథం పోతే దేవుడికి పోయేది ఏమీ లేదు.

by Anukaran |
రథం పోతే దేవుడికి పోయేది ఏమీ లేదు.
X

దిశవెబ్ డెస్క్: తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకు,చర్చికి డిక్లరేషన్ లేదని అన్నారు. అలాంటి డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని ఆయన అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఎక్కడా లేని సంప్రదాయం తిరుమలలోనే ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్లినప్పుడు చంద్రబాబు డిక్లరేషన్ ఎందుకు అడగలేదని ఆయన అన్నారు. సంతకం పెట్టకుండా శ్రీ వారి గుడికి వెళితే తిరుమల అపవిత్రం అవుతుందా అని ఆయన అన్నారు. దేవాలయాలపై వరుస ఘటనల విషయంలో టీడీపీ నేతలపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 10కిలోల వెండి బొమ్మలు ఎత్తుకుపోతే, కోటి రూపాలయ రథం పోతే దేవుడికి పోయేది ఏమీ లేదని ఆయన చెప్పారు.

Advertisement

Next Story