- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కరోనా బాధితులకు మంత్రి పరామర్శ
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చివ్వేంల మండలం ఇమామ్‌పేటలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ విన్‌య్‌కృష్ణారెడ్డి వైద్య అధికారులతో కలిసి క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి బాధితులతో నేరుగా మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 43 మంది కరోనా బాధితులతో పాటు
అనుమానితులతో మంత్రి స్వయంగా మాట్లాడి వారిలో భరోసా నింపారు. కరోనా బారిన పడిన వారు దైర్యంగా క్వారంటైన్‌లో ఉండి తగిన చికిత్స పొంది కరోనా కట్టడికి సహకారాన్ని అందించాలన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామని బాధపడకుండా సమాజానికి మంచి చేస్తున్నామన్న కోణంలో బాధితులు ఆలోచించాలని కోరారు. క్వారంటైన్ లో స్వల్ప అసౌకర్యాలు ఉన్నాయని బాధితులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే బాధితులు కోరిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహద పడే బత్తాయి, నిమ్మ వంటి పండ్లను నిత్యం రోగులకు అందించాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌లో కూడా రోగులు దూరం పాటించి కోలుకొని ఆరోగ్యవంతులుగా బయటకు వెళ్లాలని మంత్రి బాధితులను కోరారు.మొత్తంగా మంత్రి రాక కరోనా బాధితుల్లో ఉత్సాహం నింపింది.
Tags : Minister Jagadish Reddy, Visitation, corona victims, nalgonda, mp lingaih