విభిన్న కథనాలతో దూసుకెళ్తున్న 'దిశ '

by Shyam |   ( Updated:2021-01-22 02:14:37.0  )
విభిన్న కథనాలతో దూసుకెళ్తున్న దిశ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు విభిన్న కథనాలతో ‘దిశ ‘ దినపత్రిక దూసుకెళ్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య మీడియా వ్యవస్థ వారధిగా పని చేయాలన్నారు. డిజిటల్ హంగులతో దిశ దినపత్రిక సరికొత్త కోణంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేస్తోందని అభినందించారు. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల ఆదరాభిమానాలకు మరింతగా చేరువ కావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో దిశ వంటి డిజిటల్ యుగమే ప్రత్యామ్నాయం కాబోతోందని తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిశ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి బాధిని నర్సింహ, సూర్యపేట దిశ నియోజకవర్గ ఇన్చార్జి పల్లపు శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, వైవీ వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story