- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ టాప్
దిశ ప్రతినిధి, నల్లగొండ: వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతే కారణమని ఆయన కొనియాడారు. గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యసంగిలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి దిగుబడిలో రికార్డు సృష్టించిందన్నారు. ఇందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయం పండుగగా మారాడమే నిదర్శనం అన్నారు. 2014కు ముందు విత్తనాల కోసం కట్టిన క్యూలో జరిగిన లాఠీ చార్జీలు, విద్యుత్ కోసం సబ్ స్టేషన్లపై దాడులు, రైతుల అరెస్టులు ఉండేవన్నారు.
దానికి తోడు శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతోనే విపక్షాలు లాంతర్లు, ఎండిపోయిన వరికంకులను ప్రదర్శించిన సందర్భాలను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి నుంచి బయటపడి పంటల దిగుబడిలో మొదటి స్థానంలో నిలిచామంటే అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ చలువ మాత్రమేనని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి, హుజుర్‌నగర్ ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.