ఆపదలో కేటీఆర్.. హరీశ్‌రావు కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2025-01-08 16:17:22.0  )
ఆపదలో కేటీఆర్.. హరీశ్‌రావు కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లాయని, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి పాలన ఏడాది గడిచినా కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు తప్ప ఇంకేం లేవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే వాటికి కోతలు పెట్టారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారని, ప్రశ్నించే వాళ్లపై కేసులు పెడుతున్నారని, ఇంతకుమించి రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదన్నారు.

మానకొండూరు సభలో రేవంత్ రెడ్డీ పై మాట్లాడినందుకు మానకొండూర్ పోలిస్ స్టేషన్లో కేసు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ మీద అక్రమ కేసు పెట్టి, అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసి, రేవంత్ రెడ్డి పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడన్నారు. లగచర్ల రైతులను అరెస్టు, అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్, తెలంగాణ తల్లి విగ్రహం మార్చి ఇలా ఏదొ ఒక ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. మళ్లీ ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు వేసి, తర్వాత ఎగ్గొట్టే ప్రయత్నం సీఎం చేస్తున్నాడన్నారు. రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిండు. లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ ఎంతో కష్టపడ్డారని, కేటీఆర్‌కు ఆపద వస్తే కూడా పార్టీ మొత్తం అండగా నిలబడుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed