- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Global Star: ఆమెపై ఆసక్తికర కామెంట్స్ చేసిన చరణ్.. ఏడిపిస్తానంటూ?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకుంటున్నాడు. చిరుత, ఆరెంజ్, ఆర్ఆర్ఆర్, రంగస్థలం, మగధీర, ధృవ వంటి సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.
రామ్ చరణ్ నటించిన ఓ కొత్త సినిమా కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న గేమ్ ఛేంజర్(game changer) చిత్రం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సీనియర్ స్టార్ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు పంచుకున్నాడు.
నానమ్మ అంజనా దేవి గురించి మాట్లాడుతూ.. నానమ్మ చేసే వంటల గురించి చెబుతుందని.. ఒకవేళ ఇంటికి దగ్గర చిత్రీకరణ కనుక జరిగితే మాత్రం కచ్చితంగా ఇంటికొచ్చి ఆమెతోనే తింటానని వివరించాడు. నానమ్మను ఆటపట్టిస్తూ ఏడడిపిండమంటే చాలా ఇష్టమని చరణ్ చెప్పుకొచ్చాడు. అలాగే అమ్మకు, నానమ్మకు గొడవలు పెట్టిస్తానని ఫన్నీగా నవ్వుతూ తెలిపాడు. కానీ నానమ్మ ఏజ్, తన మాటలకు అస్సలు సంబంధముండదని.. ప్రస్తుతం జనరేషన్ మనుషుల్లాగే థింక్ చేస్తుందని వెల్లడించాడు.
కానీ తాతయ్యకు చాలా భయపడేవాడిని పేర్కొన్నాడు. అలాగే చరణ్ అమ్మ, నానమ్మ వీడియో బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్లే చేశారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా సాగుతోంది. వాడి నానమ్మ చేసిన చేపల పులుసు అంటే వాడికి చాలా ఇష్టమని.. చిన్నప్పుడు ఎక్కువగా అల్లరి లేదు..కానీ టీనేజ్ లో చేశాడని సురేఖ వీడియోలో చెప్పుకొచ్చింది. అలాగే కిళ్లీ చిన్నపిల్లలు తినొద్దంటే చాటుగా వెళ్లి తినేవాడని.. ఇక క్లింకార అయితే చరణ్ తినిపిస్తేనే తింటుందని.. దాన్ని తినేదాక వదలడంటూ నానమ్మ అంజనా దేవి చెప్పుకొచ్చింది.