రాత్రి పడుకున్న మహిళ తెల్లవారే సరికి మిస్సింగ్​

by Sridhar Babu |
రాత్రి పడుకున్న మహిళ తెల్లవారే సరికి మిస్సింగ్​
X

దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్షన్ లైన్ లో వివాహిత అదృశ్యమైంది. బోయినపల్లి ఎస్ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఫెన్షన్ కాలనీకి చెందిన ఫర్వీన్ బేగం చిన్నకూతురు రుబీనా బేగంకు గత 3 నెలల క్రితం కర్నూల్ కు చెందిన ఫయాజ్ బాషాతో వివాహం జరిగింది. గత నెల 27న కర్నూల్ నుండి భార్యాభర్తలు బోయినపల్లికి వచ్చారని, ఇద్దరూ కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో తిరిగి వచ్చారని తెలిపారు.

ఈ నెల 2న తమ ఇంట్లో మధ్య రాత్రి భర్త ఫయాజ్ బాషా లేచి చూసేసరికి భార్య కనిపించలేదని,వెంటనే తెలిసిన వారి వద్దకు వెళ్లి ఉంటుందని ఆమె కోసం ఆరా తీయగా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కాగా రుబియా బేగం తనతో పాటు తనకు సంబంధించిన వస్తువులు, బంగారం తీసుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed