- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉపాధి కల్పనకు కేంద్రం చొరవ
దిశ, శామీర్ పేట్ : నిరుద్యోగ సమస్య తీర్చేందుకు రూ.4 లక్షల కోట్లు కేంద్రం బడ్జెట్ లో పెట్టిందని, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. దిశ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వకర్మ పథకానికి వందశాతం నిధులు కేంద్రం అందిస్తుందని, ఫిషరీస్ లో అనేక పథకాలు కేంద్రం తీసుకువచ్చిందని తెలిపారు. గతంలో మంత్రుల అధ్యక్షతన డీఆర్సీ సమావేశాలు జరిగేవని, ఈ ప్రభుత్వంలో జరగడం లేదన్నారు. వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహించే అనేక పథకాలుంటాయని, రోడ్లు, ఎన్ హెచ్ఆర్ఎం, మధ్యాహ్న భోజనం పథకంలో 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ఉపాధి హామీ పథకంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఇస్తుందని తెలిపారు. మోడీ పాలనలో- స్వతంత్య్రం వచ్చినప్పటి నుండి మన రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేలు వేశారో అంతకంటే ఎక్కువ ఈ పదేళ్లలో నిర్మించారని తెలిపారు. రైల్వే లో గణనీయమైన అభివృద్ధి చేశారని, 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేసినట్లు తెలిపారు. తెలంగాణ లో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని, చర్లపల్లి టెర్మినల్ రూ.415 కోట్లతో నిర్మించినట్లు పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కాకుండా ఆర్యూబీ, ఆర్వోబీ లకు వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. మల్కాజిగిరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం నిధులు తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈటల హామీ ఇచ్చారు.