వ్యవసాయంలో ప్రతి రైతూ శాస్త్రవేత్తే : జగదీశ్‌రెడ్డి

by Shyam |
Minister Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: వ్యవసాయరంగంలో ప్రతి రైతూ శాస్త్రవేత్తేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని సీతారామా ఫంక్షన్ హాల్‌లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ-గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, కేవీకే రైతు మిత్ర ఫౌండేషన్ సౌజన్యంతో అంతర్జాతీయ పప్పు దినోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించిన 100 మంది ఉత్తమ రైతు దంపతులకు, జర్నలిస్టులకు పుడమిపుత్ర పురస్కారాలను మంత్రి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతూ నిజమైన రైతు విప్లవకారుడన్నారు. తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ కరెంట్, నీరు, రైతు బంధు అందిస్తూ వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయం దండగ అనే దగ్గరి నుండి భూమి నుండి బంగారం కూడా తీయవచ్చని నిరూపిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి రైతులు దేశానికే ఆదర్శమని అవార్డు తీసుకున్న రైతులను అభినందించారు. సూర్యాపేటలో పుడమి పుత్ర అవార్టుల ప్రదానోత్సవ కార్యక్రమం చేపట్టిన నిర్వహకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అవార్టు పొందిన రైతులను సన్మానించారు. అనంతరం కేవీకే రైతు నేస్తం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed