దుబాయిలో గెలుస్తానని కలలు కంటున్నాడు…

by Shyam |
Minister Jagadish Reddy
X

దిశ, వెబ్ డెస్క్:
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబాయ్ పోయి గెలుస్తానని కలలు కంటున్నాడని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను ఉత్తమ్ మభ్య పెడుతున్నారని మంత్రి విమర్శించారు. హుజుర్‌నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ఉత్తమ్ కుమార్ రెడ్డిది మాట మీద నిలబడే స్వభావం కాదని అన్నారు. హుజుర్ నగర్ లో సైదిరెడ్డి విజయం తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయనీ తెలిపారు. దమ్ముంటే హుజుర్ నగర్ అభివృద్ధిపై చర్చకు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున 3వేల మంది వచ్చి ప్రచారం చేసి పది హేను వందల ఓట్లను తెచ్చుకున్నారనీ ఆయన ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీకి ఈ సారి ఆ ఓట్లు కూడా కష్టమేనని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed