డీ1 పట్టాలపై మంత్రి ఇంద్రకరణ్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ

by Aamani |   ( Updated:2021-08-30 06:00:00.0  )
డీ1 పట్టాలపై మంత్రి ఇంద్రకరణ్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
X

దిశ, నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో డీ1 పట్టాల వ్యవహారం సంచలనంగా మారింది. డీ1 పట్టాలను నిలిపి వేయాలని సంబంధిత అధికారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల జారీ చేసినట్టు రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు తెలిపారు.

ప్రజాప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆదర్శనగర్ గ్రామం SRSP ప్రాజెక్టు నీళ్ల కారణంగా ముంపునకు గురి కావడంతో ప్రభుత్వం అదనంగా 131 సర్వే నంబర్‌లో దాదాపు 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు అదనంగా భూమిని కేటాయించింది. అయితే ఈ భూమిని ఆక్రమించుకొనేందుకు డీ1 పట్టాల పేరు మీద కొందరు భూ కబ్జాదారులు అక్రమ పట్టాలను సృష్టించినట్టు తెలిపారు.

ఈ విషయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, కలెక్టర్ ముషార్రఫ్ అలీకి విన్నవించడంతో ఆ పట్టాలను వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మంత్రికి వినతి పత్రం సమర్పించిన వారిలో ఆదర్శనగర్, కమల్‌కోట్ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Next Story