‘విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు’

by Aamani |

దిశ, ఆదిలాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో వానాకాలం సాగుకు సమాయత్తం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, రైతుబంధు కోసం రూ.8,210 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అన్నారు. కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ కే విజ‌య‌ల‌క్ష్మి, రైతుబంధు స‌మితి జిల్లా క‌న్వీన‌ర్ న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story