అందరి సహకారంతో కరోనా కట్టడి : మంత్రి అల్లోల

by Aamani |
అందరి సహకారంతో కరోనా కట్టడి : మంత్రి అల్లోల
X

దిశ, అదిలాబాద్: అందరి సహకారంతో జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున సఫాయి కార్మికుల కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్క్‌లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా నుంచి కరోనా వైరస్ బారిన పడిన 20 మందిలో ఎనిమిది మంది పూర్తిగా కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వారందరినీ హోంక్వారంటైన్‌‌లో ఉంచి ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది అద్బుతంగా పని చేస్తున్నారని చెప్పారు. ఆదివారం నుంచి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి, గ్రామీణ ప్రాంత సఫాయి కర్మచారులకు బియ్యం, నూనె పప్పు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 అందించామని, మళ్లీ ఈ నెల కూడా అందిస్తామని చెప్పారు. వలస కార్మికులను సైతం గత నెల మాదిరిగానే ఆదుకుంటామని మంత్రి తెలిపారు.

Tags: Adilabad,Minister Allola Indrakaran reddy,Masks,Distribution

Advertisement

Next Story

Most Viewed