- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాపై మంత్రి అల్లోల సమీక్ష
దిశ, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం తన నివాసం నుంచి సమీక్షించారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలోని జోహార్‌నగర్ కాలనీకి చెందిన వ్యక్తి మృతి చెందడం, ఆ తర్వాత పరిణామాలపై జిల్లా అధికారులతో చర్చించారు. జిల్లాలో కరోనా ప్రభావం, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ముషారఫ్ అలీ, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా ఆసుపత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులతో ఆయన మాట్లాడారు.
సర్వేకు వస్తున్న ఆరోగ్య సిబ్బందిని కొందరు బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయంపై కూడా మంత్రి ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌ను పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లతో మాట్లాడాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, ఆరోగ్యశాఖలో సమన్వయం చేసుకొని కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags: minister allola Indrakaran reddy,corona virus,review