- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ విజయం ఐక్యతకు నిదర్శనం : ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: ఎమ్మెల్సీ దండే విఠల్ గెలుపు ఐక్యతకు నిదర్శనమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం పట్టణంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్‌లో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన దండ విఠల్‌ను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్‌లు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అధిక నిధులను తీసుకువచ్చి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దండ విఠల్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు అందుబాటులో ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని పేర్కొన్నారు. ఈ విజయం సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 2014లో టీఆర్ఎస్ తరపున సనత్ నగర్‌లో ఎమ్మెల్యేకు పోటీగా నిలబడి ఓటమి చెందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించటం హర్షనీయమని అన్నారు. తన పదవికి వన్నె తీసుకొచ్చి కేసీఆర్ మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, రేఖ శ్యాంనాయక్, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జెడ్పీ చైర్మన్‌లు రాథోడ్ జనార్ధన్, కోవా లక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.