- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది సరికొత్త దిశ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశప్రతినిధి, ఆదిలాబాద్: మిషన్ భగీరథ తో తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా పోతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ రూరల్ పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో నిర్మించిన పంప్ హౌజ్, వాటర్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించిందని, ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకుని పశ్చిమ బెంగాల్ సర్కారు ‘జల్ స్వప్న’ అనే భారీ ప్రాజెక్టును చేపడుతోందని పేర్కొన్నారు. సిద్ధాపూర్ ప్లాంట్ ద్వారా నిర్మల్ పట్టణ ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం హరితహార కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.