సిద్దిపేటలో నిశ్శబ్దం.. నిరాశలో మంత్రి హరీష్

by Shyam |   ( Updated:2021-11-02 04:07:36.0  )
సిద్దిపేటలో నిశ్శబ్దం.. నిరాశలో మంత్రి హరీష్
X

దిశ ప్రతినిధి, మెదక్: సాధారణ రోజుల్లో సిద్దిపేటకు మంత్రి హరీశ్ రావు వచ్చాడంటే హరీశ్ రావు ఇంటి ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కోలాహాలంగా మారేది. ఇక ఎన్నికల సమయంలో అయితే హరీష్ ఇంటి ప్రాంగణం మొత్తం నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా కనిపించేది. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ సందడిగా కనిపించిన సిద్దిపేట.. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంచార్జిగా వ్యవహరించిన హరీశ్ క్యాంపు కార్యాలయం నిశ్శబ్దంగా కన్పిస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీవీలో వీక్షిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా.. ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించని ఫలితాలతో అధికార టీఆర్ఎస్ షాక్ లో ఉంది. సిద్దిపేట నేతలంతా తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కకపోవడంపై హరీశ్ నిరాశ చెందుతున్నట్టు సమాచారం.

ఇళ్లు మారడమే కారణమా..?

సిద్దిపేటలో 2004 ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి హరీశ్ రావు భారత్ నగర్‌లోని తన స్వంత ఇంటి నుండే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు సైతం తమ సమస్యలు చెప్పుకునేందుకు భారత్ నగర్ లోని ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజక వర్గానికి ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. ఇటీవల సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన హరీశ్.. అక్కడి నుండే సిద్దిపేట పాలన కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారిన తర్వాత జరిగిన మొదటి ఉపఎన్నిక హుజురాబాద్. ఆ ఉప ఎన్నికకు ఇంఛార్జిగా వ్యవహరించిన హరీశ్ రావు సిద్దిపేట నేతలతో కలిసి హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. అయినా ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావట్లేదు. సెంటిమెంట్లను నమ్మే అధికార టీఆర్ఎస్ పై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. హరీశ్ ఇళ్లు మారడంతోనే ఓటమి చెందుతున్నాడంటూ గుసగుసలాడుతున్నారు. దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

హరీష్‌కు ప్రగతిభవన్‌లోకి నో ఎంట్రీ? నిజమేనా?

వర్కౌట్ కానీ సెంటిమెంట్.. అక్కడ కేసీఆర్‌కు బిగ్ షాక్

Advertisement

Next Story