- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టరేట్లో కరోనా ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ లింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా సిద్దిపేట జిల్లాలో పకడ్బంధీగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 239 మంది క్వారంటైన్లో 14 రోజులు పూర్తి చేసుకున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. కూరగాయల క్రయవిక్రయాలు ఇక నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా వారంలో మూడు రోజులేనని.. ఆది, బుధ, శుక్రవారం రోజులు తాత్కాలిక మార్కెట్లు నడుస్తాయన్నారు.
Tags: Minister Harish Rao, review, officials, siddipet