- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు ఏ పార్టీ వైపు ఉంటారో ఆలోచించుకోండి: హరీష్ రావు
దిశ, హుజురాబాద్: డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి రైతులు, ప్రజల నడుము విరుస్తున్న బీజేపీ వైపా.. పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న రైతు బాంధవుడు కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. పట్టణంలోని వెంకటసాయి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన రైతులు, విత్తన ఉత్పత్తిదారుల ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడుతూ.. 2014లో టీఆర్ఎస్ అధికారం చేపట్టకముందు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కరెంటు కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసే పరిస్థితి నుంచి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది కాదా అని ఆయన అడిగారు.
విత్తనాలు, ఎరువుల కోసం నాడు లైన్లలో నిలబడే పరిస్థితి నేడు ఉందా అర్థం చేసుకోవాలని రైతులను కోరారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పెట్టుబడితో పాటుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్న సర్కార్ కేసీఆర్ సర్కార్ అని కొనియాడారు. వచ్చే మార్చిలోగా లక్ష రూపాయల రుణాలను వడ్డీతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుందని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో దుక్కి దున్నాడానికి, వరి పంటను కోయడానికి వ్యవసాయ యంత్రాలకు పెరిగిన ధరలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన బీజేపీకి.. హుజురాబాద్‌లో జరుగనున్న ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పేందుకు కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని హరీశ్ రావు అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.