నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష

by Shyam |
నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష
X

దిశ, సిద్దిపేట: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షా బందన్ ప్రతీక అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని, ఆప్యాయతను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అని చాటి చెప్పేవిధంగా సోదర సోదరీమణుల ఆత్మీయ రక్షణతో పాటు మీ అనుబంధాన్ని, మాస్కు ధరించి శానిటైజర్‌లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Advertisement

Next Story