- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, దామరచర్ల: ఎంపీటీసీ వ్యవస్థను తీసివేస్తామని అవహేళన గా మాట్లాడిన రాష్ట్ర ఆర్ధికమంత్రి తన్నీరు హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజ్జం సైదులు మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎంపీటీసీలకు నిధులు, విధులు లేకుండా కాలరాసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంపీటీసీలకు నిధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా తయారుచేసిందని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీలకు రూ.500 కోట్లతో నిధులు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ప్రతి రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మామ, అల్లుళ్ళ ఏకచక్రాధిపత్యం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థలకు నిధులు,విధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తూ అసలు ఎంపీటీసీల మనుగడే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ కూతురు కవిత చట్టసభల్లో ఉందంటే ఎంపీటీసీ ల చలవేనని అన్నారు.