బీజేపీ నేతలకు మంత్రి హరీశ్ రావు సవాల్.. నేను నిరూపిస్తా.. ఎవరస్తారో రండి!

by Sridhar Babu |
Minister Harish Rao
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పొలిటికల్ లీడర్లు హుజురాబాద్‌లో కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ ప్రకటించిన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే, దళితబంధు పథకం లబ్దిదారులకు చేరకముందే ఎలక్షన్ కమిషన్ ఆ పథకాన్ని నిలిపివేసింది.

ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్రే అని విమర్శలు గుప్పించారు. అందుకు తన దగ్గర సాక్ష్యం కూడా ఉందన్నారు. బీజేపీ పార్టీ కావాలనే దళితులకు ఈ పథకం ఫలాలు అందకుండా చేశారన్నారు. ఏ బీజేపీ నేత వస్తారో రండి.. ఈనెల 7న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది నిజం కదా..? అని ప్రశ్నించారు. అందువల్లే దళితబంధు పథకం ఆగిపోయిందని, బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు ప్రచారంలో భాగంగా ఈ హాట్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed