సిద్దిపేట టీఆర్ఎస్ ధర్నాలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన హరీశ్ రావు

by Sridhar Babu |   ( Updated:2021-11-12 04:42:31.0  )
HARISHRAO-IN-SIDDHIPETA-1
X

దిశ ప్రతినిధి, మెదక్: యాసంగి సాగులో వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని, ఇకనైనా కేంద్రం మౌనం విడనాడాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున అధికార టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీగా తరలివచ్చారు. యాసంగి వడ్లు కొంటరా … కొనరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో నాయకులు నిరసన తెలిపారు. కేంద్రం వరి కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పేవరకూ తమ పోరాటం ఆగదన్నారు. ధర్నాలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్లు మంజుల రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గోన్నారు.

హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ ఆందోళన.. కారణమిదే..!

Advertisement

Next Story