కషాయం తాగండి.. కరోనాను జయించండి

by Shyam |
కషాయం తాగండి.. కరోనాను జయించండి
X

దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో సొంత ఖర్చులతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కషాయం తాగండి.. కరోనాను జయించండి అంటూ మంత్రి పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ కోసం పట్టణంలోని ప్రతి హోటల్, రెస్టారెంట్లలో వేడినీళ్లు అందివ్వాలని మంత్రి కోరారు. కరోనా కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదన్నారు. సిద్దిపేటకు వివిధ పనుల కోసం వచ్చేవారి కోసం మూడు చోట్ల వేడి నీటి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed