వారికి గుడ్‌న్యూస్.. హుజురాబాద్‌లో మంత్రి హరీష్ కీలక ప్రకటన

by Sridhar Babu |
Minister Harish Rao
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందిన అంగన్వాడీ టీచర్ల కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌ పట్టణంలో అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అంగన్ వాడీల వేతనాలు పెంచామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో అంగన్ వాడీలకు నెల వేతనం రూ. 3,700 ఉంటే మన రాష్ట్రంలో రూ. 13,650 ఇస్తున్నామని గుర్తుచేశారు. ఇందులో కేంద్రం ఇస్తున్నది కేవలం రూ. 2,700 మాత్రమే అని పేర్కొన్నారు.

Advertisement

Next Story