- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని రకాల ‘గుండె ఆపరేషన్లు మొత్తం ఉచితం..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇక నుంచి గుండె ఆపరేషన్లు మరింత వేగంగా జరగనున్నాయి. సర్కార్ఆసుపత్రుల్లోనే సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 4 క్యాథ్ ల్యాబ్ లను సమకూర్చనున్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, గాంధీ ఆస్పత్రిలో కొత్త మిషన్లు తీసుకురానున్నారు. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించడం, వాటిని తొలగించడమే కాకుండా, గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్ మేకర్ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరినప్పుడు దాన్ని తొలగించే చికిత్సలను ఈ క్యాథ్ ల్యాబ్ ద్వారా సులువుగా చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అంతేగాక గుండె రక్తనాళాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో స్టెంట్లను చేతుల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా వేయాల్సి వస్తుంది.
క్లోమగ్రంధిలోనూ కొన్నిసార్లు స్టెంట్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో క్యాథ్‌ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలా ఖరీదైన వైద్య చికిత్సలు. దీంతో ఇప్పటి వరకు ఈ సమస్యలున్న పేదలకు ట్రీట్మెంట్ తీసుకోవడం కష్టంగా మారింది. కానీ ఇప్పుడు సర్కార్ దవాఖానలో అందుబాటులోకి రావడంతో ఉచితంగా వైద్య చికిత్సలు అందనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో మంగళవారం మంత్రి హరీష్‌రావు నూతన క్యాథ్ ల్యాబ్, సిటీ స్కాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియాలో ఇప్పటికే రెండు సిటీ స్కాన్‌లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మూడుకు పెరిగిందన్నారు. త్వరలో 50 పడకల ఐసీయూ బెడ్స్, కొత్త వెంటిలేటర్స్‌నూ సమకూర్చుతామన్నారు. శానిటేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. జనవరి 1న మళ్ళీ ఉస్మానియాలో పర్యటిస్తానని, అప్పటి వరకు ఉస్మానియాలో సమస్యలు ఉండొద్దని మంత్రి అధికారులకు సూచించారు. దీంతో పాటు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలన్నారు. ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడిటేషన్ కోసం ధరఖాస్తు చేశామన్నారు. ఇక కోర్టు కేసు తర్వాత నూతన బిల్డింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. పేషేంట్స్‌లకు ఇచ్చే డైట్ విషయం లో క్వాలిటీ పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీఎంఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.