కరోనా భయపడే రోగం కాదు : హరీశ్ రావు

by Shyam |   ( Updated:2020-08-24 07:19:28.0  )
కరోనా భయపడే రోగం కాదు : హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట: కరోనా అంటే భయపడే రోగం కాదని, కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నారాయణరావు పేట మండలం మల్యాల గ్రామంలో సోమవారం కంపోస్టు తయారీ కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ. 40 వేలు నిధులు సమీకరించగా అదనంగా స్వయంగా మంత్రి మరో రూ.60 వేలు జోడించి ప్రజారోగ్య శ్రేయస్సు కోసం మెడికల్ హెల్త్ కిట్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా అంటే భయపడే రోగం కాదని, కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు మంత్రి సూచించారు. పీహెచ్‌సీ పరిధిలో ప్రతి రోజూ 50 కరోనా పరీక్షలు జరపాలని, గ్రామంలో గ్రామ ప్రజలంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకునేలా.. అవగాహన కల్పించాలని కోరారు.

Advertisement

Next Story