- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో అప్పర్ హ్యాండ్‌లో ఈటల.. ఫుల్ టెన్షన్‌లో మంత్రి హరీష్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి హరీష్ రావు మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మూడు నెలలుగా హుజురాబాద్‌లో సమీకరణాలను మార్చేందుకు ప్రయత్నించినప్ఫటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన హరీష్ రావు గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్‌పై దృష్టి సారించారు. రెండు రోజులుగా ఇల్లందకుంట మండలంలోని గ్రామాల వారీగా లీడర్లతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఒక్కో గ్రామానికి చెందిన నాయకులను పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడుతూ సమీకరణాలు లెక్కిస్తున్నారు.
బీజేపీ కేడర్ డాటా..
గ్రామాల వారీగా ఎవరెవరు బీజేపీలో తిరుగుతున్నారో డాటా సేకరించిన మంత్రి హరీష్ రావు ఆ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో చర్చిస్తున్నారు. బీజేపీలో తిరుగుతున్న వారిని గులాబీ గూటికి చేర్చేందుకు చొరవ చూపాలని సూచిస్తున్నారు. ఏ గ్రామంలో కూడా బీజేపీకి కేడర్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
బీజేపీలో తిరుగుతున్న వారికి ఉన్న అవసరాలు ఏంటీ..? వారు ఏం చేస్తే టీఆర్ఎస్ వైపు చూస్తారు.? అన్న వివరాలు తెలుసుకొని వారిని మెప్పించి ఒప్పించాలని చెబుతున్నారు. జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లి రైల్వే గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సీక్రెట్ మీటింగ్‌లో హరీష్ రావు దిశా నిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న హరీష్ రావు కూలంకశంగా చర్చలు జరుపుతున్నారు.
ఈటల ప్రాభవం తగ్గకపోవడం వల్లే..
మూడు నెలలుగా సభలు, సమావేశాలు, ఆయన అనుచరులను పార్టీలోకి చేర్పించుకోవడం వంటి చర్యలు తీసుకున్నా ఈటల గ్రాఫ్ మాత్రం పడిపోవడం లేదు. దీంతో విలేజ్ యూనిట్‌గా మంత్రాంగం చేయాలని మంత్రి హరీష్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇల్లందకుంట మండలంలోని వివిధ గ్రామాల నాయకులతో భేటీ అవుతున్నట్టు సమాచారం. ఎన్నికల నాటికల్లా ఈటలను వీక్ చేయాలన్న సంకల్పంతోనే ఈ ఎత్తగడకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
వేదిక మార్పు..
నిన్న మొన్నటి వరకు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెస్ట్ హౌజ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించిన మంత్రి హరీష్ రావు అనూహ్యంగా వేదికను మార్చేశారు. కొత్తపల్లి రైల్వే గేట్ సమీపంలో ఈ స్పెషల్ మీటింగ్స్ స్టార్ట్ చేశారు. లోకల్ నాయకులను హుజురాబాద్ వరకు పిలిపించుకోవడం ఎందుకు అనుకున్న మంత్రి మండలాల్లోనే లోకల్ లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే, బీజేపీ సోషల్ మీడియా కూడా హరీష్ రావు, కెప్టెన్ గెస్ట్ హౌజ్‌లో జరుపుతున్న సమీకరణాలపై సెటైర్లు వేస్తుండటం వల్లే వేదికను మార్చి ఉంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యంగా పావులు కదపాలన్న లక్ష్యంతో హరీష్ రావు లోకల్ పాలిటిక్స్ చేస్తుండటం విశేషం.