కమిషనర్‌ను కడిగిపారేసిన మంత్రి హరీశ్ రావు

by Shyam |
Minister Harish Rao
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట పట్టణ జనాభా రోజురోజుకి పెరుగుతోంది. అదేస్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలందరూ సిద్దిపేటకే వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్దిపేటలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా ఎవరు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి తరచూ వినిపిస్తున్నాయి.

సిద్దిపేట పట్టణంలో నిర్మించిన, నిర్మిస్తున్న ఒక్క భవనానికి కూడా సెట్ బ్యాక్ లేదు. అన్ని రోడ్ల మీదనే నిర్మించారు. ఆదివారం సిద్దిపేట పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీశ్ రావు ఆరో వార్డులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఒక్క ఇల్లైనా సెట్ బ్యాక్ ఉన్న ఇంటిని చూపిస్తారా అంటూ మున్సిపల్ కమిషనర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు పెరుగుతున్నాయి, ఇళ్లకు నాలుగు దిక్కులా ఐదు ఫీట్ల సెట్ బ్యాక్ ఉండాలని కమిషనర్‌కు సూచించారు.

చాలా మంది రోడ్లను అక్రమించారని, దీంతో కాలనీల్లో కార్లు పోలేని పరిస్థితి ఏర్పడిందని, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ మెయిన్ రోడ్‌లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, భవనాల్లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగితే ఎలా అని మున్సిపల్ కమిషనర్ ని ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ కమిషనర్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

Advertisement

Next Story