గోబెల్ బాబులకు బుద్ది చెప్పాలి….

by Shyam |
గోబెల్ బాబులకు బుద్ది చెప్పాలి….
X

దిశ ప్రతినిధి, మెదక్: ఓట్ల కోసం బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందనీ, గోబెల్ బీజేపీ బాబులకు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ జెండాను కూల్చినట్టు సోషల్ మీడియాలో బీజేపీ నేతలు శ్రీనివాస్ నాయక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. టీఆర్ఎస్ గద్దె కూల్చింది 2019లోననీ తెలిపారు. అది మహబూబ్ నగర్‌లో జరిగిందనీ, ఇక్కడిది కాదని స్పష్టం చేశారు. దుబ్బాకలో టౌన్‌హాల్ డబ్బులను కేసీఆర్, హరీశ్ రావు తీసుకున్నారని దుష్ప్రచారం చేశారని తెలిపారు. దుబ్బాక టౌన్ హాల్‌కు 3 కోట్లు కాదు మూడు రూపాయలు కూడా రాలేదని చెప్పారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారనీ, గోబెల్ ప్రచారాన్ని దుబ్బాక ప్రజలు గమనించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed